Prabhas: మరోమారు మంచి మనస్సు చాటుకున్న ప్రభాస్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) క్రేజ్ పరంగా టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి. ప్రభాస్ ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో వాళ్లను ఆదుకుంటూ మంచి మనస్సును చాటుకుంటున్నారు. వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం కొసమెరుపు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మొత్తం సహాయం ప్రకటించిన హీరో ప్రభాస్ కావడం గమనార్హం.

Prabhas

వయనాడ్ లో వరద భీభత్సం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కొండచరియలు విరిగి పడటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ఆయన టీమ్ వెల్లడించడం గమనార్హం. టాలీవుడ్ నుంచి చిరంజీవి  (Chiranjeevi) , రామ్ చరణ్  (Ram Charan) కోటి రూపాయలు విరాళం ప్రకటించగా బన్నీ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ మనస్సు గొప్ప మనస్సు అని ఎవరు కష్టాల్లో ప్రభాస్ అస్సలు తట్టుకోలేరని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కన్నప్ప (Kannappa) , ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం . ప్రభాస్ టాలీవుడ్ నుంచి హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ముందువరసలో ఉన్నారు.

ప్రభాస్ ఈ రోల్ ఆ రోల్ అనే తేడాల్లేకుండా ప్రేక్షకులను మెప్పించే ప్రతి రోల్ కోసం తన వంతు కష్టపడుతున్నారు. ప్రభాస్ సినిమా సినిమాకు లుక్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ కథాంశాలకు ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు.

చరణ్, అల్లు అర్జున్ కాంబోలో మరో మూవీ దిశగా అడుగులు.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus