కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఈశ్వర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని హీరోగా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు .బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా అప్పటినుంచి ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ను చాలామంది అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు కానీ ప్రభాస్ కి ఒక పేరుతో పిలిస్తే మాత్రం అస్సలు నచ్చదట.
తన స్నేహితులు ఎప్పుడైనా తనని ఆ పేరుతో పిలిస్తే చాలా కోప్పడతారని తెలుస్తోంది. మరి ఈయనకు నచ్చినీ ఆ పేరు ఏంటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ ఇంటి పేరు ఉప్పలపాటి కావడంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈయనని ఆటపట్టించడం కోసం ఉప్పు అని పిలుస్తారట. ఇలా కొంతమంది ఉప్పు అని మరి కొంతమంది పప్పు అని పిలుస్తూ తనని ఆట పట్టించే వారట అయితే తనకు ఇలా పెట్ నేమ్ తో కనుక పిలిస్తే చాలా కోపం వస్తుందని తెలిసి
తన స్నేహితుల తనని ఆటపట్టించే వారట అయితే వారందరికీ కూడా ఇకపై ఇలా పిలవద్దు అంటూ ఈయన తన స్టైల్ లోనే చెప్పేవారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి అనుష్క మాత్రం ప్రభాస్ ను ఆటపటించడం కోసం తరచూ ఉప్పు పప్పు అంటూ పిలిచేవారట. అయితే తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి గోపీచంద్ మాత్రం ప్రభాస్ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తనని ఎప్పుడు ప్రభాస్ అంటూ పిలిచేవారని తెలుస్తోంది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !