ప్రభాస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తరువాత ‘ఆదిపురుష్’, ఆ వెంటనే నాగ్ అశ్విన్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ మేకర్స్ ప్రభాస్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. ప్రభాస్ చేస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుండి మొదలుకానుంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి రోల్ పోషించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి రాముడి లుక్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే రాముడిగా ప్రభాస్ ని ఊహిస్తూ అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చాయి. తాజాగా ఓ అభిమాని రాముని గెటప్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో ఓ లుక్‌ను తయారు చేసి పోస్ట్‌ చేశాడు.

సముద్ర తీరాన సిక్స్ ప్యాక్ బాడీతో సీరియస్ లుక్ లో రామునిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ అంతా ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన చిత్ర దర్శకుడు ఓం రౌత్ దీనిపై స్పందిస్తూ.. ‘ఈ లుక్‌ చూసి స్టన్‌ అయ్యాను.. మీకు చాలా శక్తి ఉంది’ అంటూ కామెంట్ చేశాడు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus