ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంత ఈజీగా కాదు. సినిమాల్లో అయితే ఇది ఇంకొంచెం ఎక్కువ కష్టం. చిత్రబృందం ప్రమేయం లేకుండానే సినిమా అంచనాలు మించిపోతుంటాయి. ఎంతొద్దు అనుకున్నా… అంచనాలు ఆకాశానికి అంటిపోతుంటాయి. దీంతో వాటిని అందుకోలేక సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిలపడతాయి. ఇది ఒక రకం సమస్య. మరికొన్ని రకాల సినిమాలు ఉంటాయి. సినిమా టీమే హైప్‌లను పెంచేస్తూ ఉంటుంది. చిన్న కథకు, భారీ బిల్డప్, హంగులు యాడ్ చేసి సినిమా రూపొందిస్తుంది. అసలు కంటే కొసరు ఎక్కువై ఆ సినిమాలు బోల్తాపడతాయి.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ‘రాధేశ్యామ్’ సినిమా గురించే. ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సినిమాకు రకరకాల రెస్పాన్స్‌లు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా అయితే ఏకంగా సినిమాను తూర్పారబట్టాయి. ఇంతోటి కథకు అంత డబ్బులు అవసరమా? అన్ని హంగులు అవసరమా అంటూ అక్కడి క్రిటిక్స్ ఉతికి ఆరేస్తున్నారు. మన దగ్గర కూడా ఇంచుమించి అంతే. సినిమా విడుదలయ్యాక కథ, కథనం, దర్శకుడు, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడకుండా మిగిలిన విషయాలు చర్చకు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన విషయం తెలిసిందే. అంతటి ఇమేజ్ వచ్చాక తర్వాత చేసే సినిమాలు ఆ స్థాయి కథలు అయి ఉండాలి. లేదంటే దేశం మొత్తం ఆ సినిమావైపు చూసే కథలు అయి ఉండాలి. కానీ… ప్రభాస్ సినిమాలు అలా ఉండటం లేదు అనేది ఎవరైనా చెప్పేస్తారు. సాధారణ కథలను పాన్ ఇండియా లెవల్‌కి ఆల్టర్ చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కావొచ్చు.. ఇప్పుడు వచ్చిన ‘రాధేశ్యామ్’ కావొచ్చు.. అన్నీ ఫక్తు తెలుగు సినిమా కథలే. అయితే వాటికి అదనపు హంగులు అద్దుతున్నారు.
అన్ని భాషల నటుల్ని సినిమాలోకి తీసుకుంటున్నారు. సాంకేతిక నిపుణుల విషయంలోనూ అంతే. ఈ క్రమంలో సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు. అలా మా సినిమా భారీ చిత్రం, పాన్ ఇండియా చిత్రం అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ‘సాహో’ సమయంలో ఇలా జరిగే… అంచనాలు అందుకోక సినిమా రావడం, రావడం మూలన పడింది. ఇక ‘రాధేశ్యామ్’లో కూడా అదే చేశారు. అంతెందుకు ప్రభాసే చెప్పాడు. ఈ సినిమాను ఇంకా తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమాగా కూడా తీయొచ్చు అని. కాబట్టి think big, make big and deliver big. అంతే కానీ think big, make small and deliver big కాదు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!