ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతకాలం రాజాసాబ్ (The Raja saab) టీజర్ కోసం ఎదురుచూడాలి? మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మినహా, ప్రమోషనల్ అప్‌డేట్ ఏమాత్రం రాలేదు. ప్రభాస్ సినిమా అంటే సాధారణంగా మొదటి నుంచే హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ సినిమాపై టీం చూపిస్తున్న మౌనం అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్ రిలీజ్ అనుకున్నారు.
కానీ ఇప్పటివరకు ఫైనల్ రిలీజ్ డేట్ క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా, టీజర్ అయినా విడుదల చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండటంతో, ఆడియన్స్ కాస్త అసహనానికి లోనవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్‌లో కొత్తగా ఉండబోతుందని టాక్. అయితే, ప్రమోషన్లు లేకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం ఎంతవరకు మంచి ఆలోచన అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇటీవలే స్టార్ హీరోల సినిమాలు టీజర్, ట్రైలర్ ప్రమోషన్ల ద్వారా భారీ రీచ్ సాధించాయి. రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత ఈ విషయంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకులు కూడా ప్రమోషన్స్ ఎలా చేయాలో సెట్ చేసుకున్నారు. కానీ రాజాసాబ్ టీం మాత్రం పూర్తి నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మారుతి మీడియా ముందు కనిపించినా ఈ సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతుంటే, అతను మాత్రం “తర్వాత చెప్తా” అంటూ తప్పించుకుంటున్నాడు.
స్టార్ హీరో సినిమా అంటే అనేక అంచనాలు సహజం. కానీ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించడం మంచిదేనా? ఎంత ఆలస్యం చేసినా, సినిమా ఎప్పుడు వస్తుందన్న ఆసక్తిని పెంచడమే కాదు, చివరికి అంచనాలను అందుకోవాలి. మరి టీజర్ దర్శనం ఎప్పుడవుతుందో మేకప్స్ ప్రమోషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.