ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విషయంతోనూ హాట్ టాపిక్ అవ్వడం లేదు కానీ.. ఒక్క టికెట్ రేట్ల ఇష్యుని క్రియేట్ చేసి దేశమంతా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కక్ష్యకట్టి సినిమా పరిశ్రమని టార్గెట్ చేసి.. ముప్పు తిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించింది. టికెట్ రేట్లు తగ్గించేయడం,దీని పై ప్రశ్నించిన వారి సినిమాలు ప్రదర్శింపబడుతున్న థియేటర్లను ఏదో ఒక వంక పెట్టి మూసేయడం.. అబ్బో మామూలు ముచ్చట కాదు ఇదంతా..!
పోనిలే కిందా మీద పడి మన సినీ పెద్దలు వెళ్ళి కొత్త జీవో ప్రవేశపెట్టి సినిమా పరిశ్రమని ఆదుకోవాలని కోరగా వాళ్ళు ఓకె చెప్పి కొత్త జీవోని అమలు చేయడానికి పిలుపునిచ్చారు. ‘రాధే శ్యామ్’ కు అది అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటే అలాంటిది ఏమీ జరగడం లేకపోవడం ప్రభాస్ అభిమానులను నిరాశపరుస్తుంది. రేపు విడుదల కాబోతున్న ‘రాధే శ్యామ్’ చిత్రం టికెట్లు ఏపిలో బుక్ మై షోలో ఇంకా ఓపెన్ కాలేదు.
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 13దీనికి వర్తించడం లేదు అని వినికిడి. ఆ జీవో ప్రకారం చూస్తే..20 శాతం షూటింగ్ ఆంధ్రాలో జరుపుకున్న సినిమాలకే టికెట్ రేట్ల హైక్ అనేది వర్తిస్తుంది. 5వ షోకి అనుమతి ఉంటుంది. అది పారితోషికాలు కాకుండా రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా అయ్యుండాలి. 2 వ షరతుని బట్టి ‘రాధే శ్యామ్’ దానికి ఓకె.. కానీ మొదటి షరతుని బట్టి అయితే కాదు.
అందుకే ఆ జీవోని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ మూవీకి కూడా బెనిఫిట్ షోలు వంటివి ఉండవు. ఏది ఏమైనా ఇంకా సినిమా టికెట్లు బుక్ మై షోలో దర్శనం ఇవ్వకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!