Prabhas: వద్దంటూ తల పట్టుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పౌరాణిక, దేవుడి పాత్రలపై మక్కువ పెంచుకుంటున్నాడా అంటే అవుననే అనిపిస్తుంది. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా, మాస్ హీరోగా చేసిన ప్రభాస్ బాహుబలి నుంచి కొత్త కొత్త పాత్రలు చేస్తున్నాడు. బాహుబలిలో రాజులా కనిపించి మెప్పించాడు, సాహోలో హాలీవుడ్ హీరోలా మెప్పించాడు. ఇక ఆదిపురుష్ లో రాముడిలా కనిపించదు. ఇప్పుడు మరో రెండు దేవుడి పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న భక్త కన్నప్ప సినిమాలో విష్ణు కన్నప్ప క్యారెక్టర్ చేయగా ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.

ఇవాళ ఉదయం పలువురు సినిమా పీఆర్ లు ఈ విషయాన్ని పోస్ట్ చేయగా మంచు విష్ణు ఈ విషయాన్ని షేర్ చేసి ఔను అన్నట్టు ఇండైరెక్ట్ గానే చెప్పాడు. దీంతో భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు మొదట షాక్ అయినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ రాబోయే సినిమాల్లో కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కలియుగం అంతంలో జరిగే కథలా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ మహా విష్ణువు అవతారంలో, కల్కి అవతారంలో కనిపిస్తాడని ఊహా గానాలు ఉన్నాయి. అయితే వీటిని చిత్ర యూనిట్ మాత్రం ఖండించలేదు. దీంతో నిజంగానే కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణువు లేదా కల్కి పాతరలో కనిపిస్తాడని అనుకుంటున్నారు.

ఇక గతంలో ప్రభాస్ (Prabhas) యమదొంగ సినిమాని నిర్మించిన విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ టైటిల్ కోసం విశ్వామిత్ర గెటప్ కూడా వేశాడు. ఈ బ్యానర్ రాజమౌళి ఫ్యామిలీదే. ఆ తర్వాత మిర్చి సినిమాలో ఓ సాంగ్ లో కృష్ణుడి గెటప్ లో కూడా కనిపించాడు ప్రభాస్.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus