Salaar 2: సలార్2 విషయంలో ఆ తప్పులు జరగకుండా ప్రశాంత్ జాగ్రత్త పడతారా?

ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్2 మూవీ షూట్ మే నెల రెండో వారంలో మొదలుకానుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) , శృతిహాసన్ (Shruti Haasan) అప్పటికి ఫ్రీ అవుతారని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సలార్2 సినిమాను రిలీజ్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ ఉందని భోగట్టా. సలార్2 సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తి కాగా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లో చిన్నచిన్న మార్పులు చేస్తున్నారని సమాచారం.

సలార్ (Salaar) సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఉగ్రం మూలకథను తీసుకుని ప్రశాంత్ నీల్ సలార్ ను తెరకెక్కించారు. అయితే ఉగ్రం సినిమాను ఇప్పటికే చూసిన వాళ్లకు, ఉగ్రం కథ విన్నవాళ్లకు సలార్2 సినిమాలో కొన్ని ట్విస్టులకు సంబంధించిన సీక్రెట్స్ ఇప్పటికే తెలిసిపోయాయి. ఉగ్రంలో ఉన్న ట్విస్టులు సలార్2 సినిమాలో కూడా రిపీట్ అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో థ్రిల్ పొందలేరు.

సలార్2 సినిమా విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్2 సినిమాలో యాక్షన్ సీన్స్ మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సలార్2 సినిమా విజువల్స్ పరంగా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సలార్2 సినిమాలో మరికొన్ని పాత్రలు పరిచయం అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్2 సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. కొన్ని ఏరియాలలో సలార్1 సినిమాకు సంబంధించి నష్టాలు రాగా ఆ నష్టాలను మేకర్స్ ఇప్పటికే భర్తీ చేశారని తెలుస్తోంది. సలార్2 బాహుబలి2 రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus