సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ అనేవి కొత్తగా ఏమి లేవు, ఎప్పటి నుండో ఉన్నవే. స్టార్ హీరోలు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ తిట్టుకోవడం మనం సోషల్ మీడియా ప్రారంభమైన రోజుల నుండే చూస్తూ ఉన్నాము. దీనికి అంతం లేదు, అయితే ఇన్ని రోజులు మన టాలీవుడ్ హీరోల అభిమానులు మరో టాలీవుడ్ స్టార్ హీరో అభిమానులతో గొడవలు పడడం చూసాము. కానీ ఇప్పుడు ప్రభాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకుంటున్నారు.
ప్రతీ రోజు వీళ్ళ మధ్య ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. కారణం డిసెంబర్ 22 వ తారీఖున ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి పోటీ గా షారుఖ్ ఖాన్ ‘దుంకీ’ చిత్రం విడుదల కానుంది. రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు రాబోతుండడం ఇప్పుడు బయ్యర్స్ కి తలనొప్పిగా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు హీరోయిన్ మాళవిక మోహనన్ ఈ ఫ్యాన్ ఫార్స్ లో తనకి తెలియకుండానే ఇన్వాల్వ్ అయ్యింది.
ఒక అభిమాని ఎందుకు ఈమధ్య ట్విట్టర్ కి దూరం గా ఉంటున్నావ్ అని అడుగుతాడు. అతని అకౌంట్ పేరు ‘బ్రా – బాయ్స్’ అని చివర్లో ఆంబోతు ఎమోజీ ని పెడుతాడు. ప్రభాస్ అనే పేరు ని అలా ట్రోల్ చేస్తూ పెట్టాడు అన్నమాట అతను. ఈ విషయం తెలియక మాళవిక మోహనన్ ‘వావ్..మీ అకౌంట్ పేరు చాలా ఆసక్తికరంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. ఆమెకి అది ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారనే విషయం తెలిసి కూడా కావాలనే రిప్లై ఇచ్చింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మాళవిక మోహనన్ పై విరుసుకుపడుతున్నారు.
ప్రస్తుతం ఆమె (Prabhas) ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయం లో వీళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగిందా?, అందుకే మాళవిక ఇలా సమాధానం ఇచ్చిందా అనే సందేహాన్ని వ్యక్త పరుస్తున్నారు ఫ్యాన్స్.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !