ప్రభాస్ (Prabhas) , హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలను సెట్ చేసింది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథ కావడంతో ఇది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ అవుతుందనే టాక్ ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ కోసం మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉందట.
ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త డైమెన్షన్ ఇవ్వబోతుందని టాక్. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించబోయే పాత్ర కోసం మేకర్స్ కొంతకాలంగా సరైన నటిని వెతుకుతున్నారు. హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని అద్భుతంగా మలిచిన విధంగా, ఇందులో కూడా అదే స్పెషాలిటీ చూపించబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు గతంలో ‘పడి పడి లేచే మనసు’లో (Padi Padi Leche Manasu) ఆమెతో పనిచేసిన అనుభవం ఉండటంతో, ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, తండేల్ (Thandel) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నడుమ, హను రాఘవపూడి, సాయి పల్లవి (Sai Pallavi) భేటీ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ వినిపించగానే, ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందట, అయితే ఇప్పుడే ఓకే చెప్పకూడదని ఆమె భావించిందట. ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.
సాయి పల్లవి ఇప్పటికే నేచురల్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే, మరికొందరు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి, ఈ పాత్రను ఎవరు పోషిస్తారు? సాయి పల్లవి నేనా? లేక మరో టాలెంటెడ్ నటి అవకాశాన్ని దక్కించుకుంటుందా అన్నది చూడాలి.