ఇలాంటి టైంలో.. ప్రమోషన్ చేయకపోతే ఎలా డార్లింగ్..!

  • September 5, 2019 / 06:54 PM IST

ప్రభాస్ ఏంటి… మహేష్ లా తయారవ్వడం ఏంటి… అని అనుకుంటున్నారా? మహేష్ చేసే సినిమాలకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా డిజాస్టర్ టాక్ వచ్చినా ఓ రేంజ్లో ప్రమోషన్లు చేసి సినిమాని నిలబెడతాడు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అయితే ఒక వేళ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. డిజాస్టర్ టాక్ వచ్చినా అస్సలు అడ్రెస్స్ ఉండడు… వెంటనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకి ట్రిప్ లకి వెళ్ళిపోతుంటాడు. ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ సినిమాల టైంలో ఇలాగే చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా మహేష్ లానే తయారయ్యాడంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే… గత వారం విడుదలైన ప్రభాస్ ‘సాహో’ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రం 350 కోట్ల గ్రాస్ కల్లెక్షన్లని నమోదు చేసింది. అయితే శుక్ర,శని వారలు వీకెండ్ అలాగే ఆదివారం సెలవు ఇక సోమవారం ‘వినాయక చవితి’ సెలవు కలిసి రావడంతో ఈ రేంజ్ వసూళ్ళు సాధ్యమయ్యాయి. అయితే మంగళవారం నుండీ సీన్ పూర్తిగా మారిపోయింది. ఒక్క హిందీలో తప్ప తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగా నెమ్మదించాయి. సినిమాకి సరైన ప్రమోషన్లు నిర్వహించకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రభాస్ వెళ్ళి విదేశాల్లో కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాహో’ ని నిర్మాతలు కూడా పట్టించుకోవట్లేదు. సినిమాకి థియేట్రికల్ 290 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకూ 190 కోట్ల వరకూ షేర్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వారం ఎలాగూ పోటీగా ఏ సినిమా లేదు. ఇలాంటి సమయంలోనే ప్రమోట్ చేస్తే మరో వారం వరకూ క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం పై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus