యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ని ‘డార్లింగ్’ని చేసింది పూరి జగన్నాథ్ అనడంలో సందేహం లేదు. అందరూ ‘బాహుబలి’ కి ముందు ప్రభాస్ వేరు.. బాహుబలి తర్వాత ప్రభాస్ వేరు అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ‘బుజ్జిగాడు’ కి ముందు ప్రభాస్ వేరు.. ‘బుజ్జిగాడు’ కి తర్వాత ప్రభాస్ వేరు అని చెప్పాలి.
వాస్తవానికి ‘బుజ్జిగాడు’ హిట్ సినిమా కాదు. కానీ ప్రభాస్ లో ఉన్న ఎనర్జీని, అతని ఈజ్ ను, ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ని, కామెడీ టైమింగ్ ను బయటకు తీసింది ‘బుజ్జిగాడు’ సినిమానే అనడంలో సందేహం లేదు. ఆ క్రెడిట్ కూడా పూరీదే. ‘బుజ్జిగాడు’ తర్వాతే ప్రభాస్ ని ఓన్ చేసుకున్నారు చాలా మంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమా కూడా వచ్చింది. దాన్ని కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇష్టపడతారు.
ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. పూరీ ఇప్పుడున్న ఫామ్ కి ప్రభాస్ సినిమా చేస్తానంటే.. అభిమానులే ‘వద్దు’ అంటారు అనడంలో కూడా అతిశయోక్తి కాదు. కానీ పూరీ, ఛార్మి.. ప్రభాస్ ను అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. తాజాగా పూరీ – ఛార్మి మరోసారి ప్రభాస్ ను కలవడం జరిగింది. ‘ది రాజాసాబ్’ సెట్స్ కి వెళ్లి ప్రభాస్ ను కలిశారు పూరీ- ఛార్మి. ఎందుకు కలిశారు అంటే ఆన్సర్ లేదు కానీ.. ఇందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి.