Prabhas, Balayya: ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆహా కూడా ఇబ్బంది పెట్టింది!

ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎందుకంటే ఈ టాక్ షో ని హోస్ట్ చేస్తుంది నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరో. ఇండస్ట్రీలో చాలా పలుకుబడి ఉన్న హీరో. ఒకప్పటి సీఎం కొడుకు (సీనియర్ ఎన్టీఆర్). అలాగే అతని బావగారు(చంద్రబాబు) కూడా సీఎం గా చేశారు.కాబట్టి బాలయ్యకి ఇండస్ట్రీలో పలుకుబడి, గౌరవం ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి వ్యక్తి సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగితే ఎంతటి స్టార్ అయినా సమాధానం చెప్పకుండా ఉంటారా.

అందుకే కాంట్రవర్సీలకు సంబంధిచిన విషయాలు కూడా ఇక్కడ చర్చిస్తూ ఉంటారు. ఇలాంటి టాక్ షోకి ప్రభాస్ వంటి స్టార్ హీరో వస్తున్నాడు అంటే.. హడావిడి ఏ రేంజ్ లో ఉండాలి. గ్లింప్స్ తోనే మోత మోగిపోవాలి . కానీ అనుకున్న టైం కి ఆహా వారు గ్లింప్స్ ఇవ్వలేదు. చాలా లేట్ చేశారు. ఇక గ్లింప్స్ ఏమైనా హైలెట్ ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. ‘ఏం చెబుతున్నావ్ ..డార్లింగ్ ‘ అనే డైలాగ్ తప్ప. ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ కూడా పాల్గొంటున్నాడు.

ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య … ప్రభాస్ – అనుష్క ల రిలేషన్ గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు. అనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రమోలో అయినా ఇవి ఉంటాయో లేదో చూడాలి.మరోపక్క ప్రభాస్ సినిమా అప్డేట్ ల కోసమే కాకుండా.. ఇలాంటి షోల అప్డేట్ ల కోసం అలాగే, గ్లింప్స్ వంటి కోసం కూడా ఎదురుచూడాల్సి.. వస్తుంది అంటూ ఫ్యాన్స్ డిజప్పాయిట్మెంట్ కు గురవుతున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus