Prabhas: ప్రభాస్‌ కోసం కూడా యుద్ధాన్ని సిద్ధం చేస్తున్న హను.. ఎప్పుడంటే?

Advertisement

‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’.. అంటూ ‘సీతారామం’ను తీసుకొచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలను కాన్‌ఫ్లిక్ట్‌గా చూపించడం, తెరకెక్కించడం ఆయనకు మాత్రమే సాధ్యం అని అంటుంటారు. మరోసారి ఈ సినిమాతో అది నిరూపించారు. ఆయన ఇప్పుడు మరో కొత్త సినిమాకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లు నిజమైతే ఆయన నెక్స్ట్‌ మూవీ ప్రభాస్‌తో ఉండొచ్చు. అంతేకాదు ఈ మేరకు ఆయన ఓ కథ కూడా సిద్ధం చేశారు అని సమాచారం.

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడి పడి లేచే మనసు’ అంటూ వైవిధ్యమైన ప్రేమకథలను తీసుకుని ముందుకెళ్తున్న హను రాఘవపూడి… ‘సీతా రామం’తో ప్రేమకథల స్పెషలిస్ట్‌ అనే పేరును నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చూపు మళ్లీ యుద్ధం మీద పడిందట. అయితే ఈసారి అందులో ప్రేమకథ ఉన్నా.. అంత పెద్ద మొత్తంలో ఉండదు అని అంటున్నారు. అయితే ఈ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అని సమాచారం. ఈ కథను ఇప్పటికే (Prabhas) ప్రభాస్‌కి చెప్పగా ఆయన ఎగ్జైట్‌ అయ్యారు అని అంటున్నారు.

రామ్ చరణ్, సూర్య, కార్తి, నాని వంటి హీరోలకు హను ఇప్పటికే ఈ కథ వినిపించినా వాళ్ల నుండి సరైన స్పందన రాలేదు. దీంతో ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ దగ్గరకు వచ్చిందట. హను రాఘవపూడి లవ్ స్టోరీస్‌‌ను ఆసక్తిగా మలిచే విధానం ప్రభాస్‌కు బాగా ఇష్టమట. అందుకే ఈ కథకు మంచి ప్రేమకథ యాడ్‌ చేయమని అడిగారట. ప్రస్తుతం హను ఇదే పనిలో ఉన్నారట. త్వరలోనే మరోసారి కథ వినిపించి ఓకే చేసుకుంటారని సమాచారం.

వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌ తీసుకుని స్నేహం – ప్రేమక అనే అంశాలతో ఈ కథ సిద్ధం చేస్తున్నారట. అన్నీ కుదిరితే రాబోయే రెండు వారాల్లో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. ప్రభాస్‌ – మైత్రి కాంబోలో సినిమా చాలా రోజుల నుండి చర్చలో ఉన్నా అవ్వడం లేదు. ఇప్పుడు అవుతోంది అంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read