ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించే కాంబినేషన్

బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ & ఇమేజ్ ఏస్థాయిలో మారిపోయాయి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోలకు మించిన పాపులారిటీ ఇప్పుడు ప్రభాస్ సొంతం. మనోడి మార్కెట్ స్టామినా ఏమిటి అనేది సాహో ప్రూవ్ చేసింది. ఫ్లాప్ సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన ఇమేజ్ ప్రభాస్ కు సొంతం. ఇప్పుడు ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు. ప్రభాస్ మరియు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ హీరోలుగా ఒక ప్రొజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాయి కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు.

గ్రీకు శిల్పాల్లాంటి ప్రభాస్ & హృతిక్ ఒక తెరపై కనిపించడం అనేది ఇప్పటికైతే కలగానే ఉంది కానీ.. ఈ కాంబినేషన్ అనుకున్న ప్రకారం వర్కవుట్ అయితే ఇండియన్ సినిమా స్థాయి మరో పడిమెట్లు ఎక్కడం ఖాయం. ప్రస్తుతం రాధేశ్యామ్ మరియు నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ కమిట్మెంట్స్ అయిపోయాక ఈ క్రేజీ ప్రొజెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ వార్త తెలిసిన ప్రభాస్ అభిమానులు అప్పుడే సంబరపడిపోవడం మొదలెట్టేశారు.

హాలీవుడ్ హీరోల్లా ఉండే ప్రభాస్ & హృతిక్ రొషన్ లు ఒకే తెరపై కనిపిస్తారంటే సినిమా అభిమానులకు కూడా అంతకుమించిన ఆనందం ఏం ఉంటుంది అయితే.. ఈ కాంబినేషన్ లో ధూమ్ సిరీస్ సినిమా తెరకెక్కే అవకాశాలునాయని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రొజెక్ట్ పట్టాలేక్కుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus