ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు అని రాజమౌళి ‘సాహో’ ప్రీ రిలీజ్ లో అంటుంటే… ‘ఇది మరీ ఓవర్ గా ఉందే’ అని కామెంట్స్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ రాజమౌళి ఊరికే అన్నాడో… ప్రభాస్ పై అంత నమ్మకంతో అన్నాడో కానీ ఇప్పుడు అది నిజమేనేమో అన్న అనుమానం కలుగక మానదు. విషయం ఏమిటంటే గత శుక్రవారం(ఆగష్టు 30న) విడుదలైన ‘సాహో’ చిత్రం అస్సలు బాలేదని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇక క్రిటిక్స్ అయితే ఇదే ఛాన్స్ అని తెగ రెచ్చిపోయి నెగెటివ్ రివ్యూలు, రేటింగులు ఇస్తూ వచ్చారు. సాధారణంగా ఈమధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా కొంచెం నెగిటివ్ టాక్ వస్తే సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. మొదటి రోజు పక్కన పెడితే ఆ వీకెండ్, సెలవు ఉన్నప్పటికీ కనీ కష్టంగా 50 కోట్ల షేర్ దాటుతుంది. ఎంత పెద్ద బడ్జెట్ సినిమాకి అయినా ఇదే పరిస్థితి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం రివర్స్ లో ఉంది.
డిజాస్టర్ టాక్ వచ్చినా సరే.. రికార్డు కలెక్షన్లు వచ్చాయి ‘సాహో’ చిత్రానికి..! ఇక టాలీవుడ్ లో ‘బాహుబలి’ సిరీస్ తరువాత ‘సాహో’ చిత్రమే నిలిచింది. ఇక ఈ చిత్రం మొదటి వీకెండ్ కలెక్షన్లు హాలీవుడ్ సినిమాలకు కూడా పోటీగా నిలిచింది. మొదటి వీకెండ్ కు గాను వరల్డ్ వైడ్ సినిమాల్లో ‘సాహో’ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ‘హాబ్స్ అండ్ షా’ చిత్రం 45 మిలియన్ డాలర్లను కొల్లగొట్టగా.. ‘సాహో’ చిత్రం 41 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక ‘ది లయన్ కింగ్’ చిత్రం 27 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలువగా… ‘ఒన్స్ అప్ ఆన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ చిత్రం 25 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలోను మరియు ‘ఏంజల్ హేజ్ ఫాలెన్’ చిత్రం 24 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో నిలిచింది.