‘సాహో’ కు జరిగిన మిస్టేక్.. ‘జాన్’ కు రిపీట్ అవ్వట్లేదులెండి..!

‘బాహుబలి2’ తర్వాత రెండేళ్ళ టైం తీసుకుని ‘సాహో’ చిత్రాన్ని చేసాడు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్లో రూపొందిన ఈ చిత్రానికి 350 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్టు ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మొదట ఈ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే ఎక్కువ షూటింగ్ షెడ్యూల్స్ జరగడంతో బడ్జెట్ ఎక్సీడ్ అయినట్టు ట్రేడ్ పండితులు.. అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఏమైనా నిర్మాతలు అయితే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా 138 కోట్ల వరకూ వచ్చాయి కాబట్టి..! కానీ చాలా వరకూ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు.

దీంతో ఇప్పుడు రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ప్రభాస్ 20 అయిన ‘జాన్’ చిత్రం బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే 20 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికీ.. ‘యూవీ క్రియేషన్స్’ వారు టెక్నికల్ మరియు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో సిట్టింగ్ లు వేసి.. అనవసరమైన ఖర్చుల జోలికి పోకూడదని చెపుతున్నారట. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రాన్ని 140 నుండీ 170 కోట్ల మధ్యలో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట. ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్ళకుండా.. ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్లు వేసి.. వేగవంతంగా సినిమాని పూర్తిచేయాలని భావిస్తున్నారట. ఏమైనా ‘సాహో’ చిత్రం విషయంలో జరిగిన తప్పుని ‘జాన్’ విషయంలో రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus