స్క్రిప్ట్ మారడంతో జాన్ రిలీజ్ డేట్ విషయంలో కొరవడిన క్లారిటీ

సీనియర్, యంగ్, జూనియర్ అని తేడా లేకుండా హీరోలందరూ కనీసం ఏడాదికి ఒక సినిమా.. కుదిరితే రెండు సినిమాలు చేస్తున్న తరుణంలో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తి చేయడానికే ఏడాది సమయం తీసుకొంటున్నాడు. “బాహుబలి” అనంతరం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఫ్యాన్ ఇండియన్ మూవీస్ అయినప్పటికీ.. మరీ సినిమాకి సినిమాకి మధ్య ఏడాది గ్యాప్ వస్తుండడం పట్ల అభిమానులు కూడా ఆనందంగా లేరు. ఈ విషయంలో ప్రభాస్ కూడా స్పందించి ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటానని చెప్పినప్పటికీ.. దాని ఆచరణ మాత్రం కనిపించలేదు.

అయితే.. నిన్నటివరకూ ప్రభాస్ తాజా చిత్రం “జాన్” దసరాకి విడుదలవుతుందని సంబరపడిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ నెత్తి మీద పిడుగు పడినట్లైంది. సినిమా కథ-కథనం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని.. షూటింగ్ కంప్లీట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమా విడుదల చేయడం 2020లో జరిగే పని కాదని తెలుస్తోంది. సొ, “మిర్చి” అనంతరం 2014, “బాహుబలి” అనంతరం 2016, “బాహుబలి 2” అనంతరం 2018లో ప్రభాస్ సినిమాలు విడుదలకానట్లే.. “సాహో” అనంతరం 2020లో ప్రభాస్ సినిమా విడుదల కావడం లేదు అనేది కాదనలేని నిజం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus