Kalki: ప్రభాస్ వర్సెస్ ప్రభాస్.. ఆ రికార్డును ఎవరు బీట్ చేస్తారో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే సంగతి తెలిసిందే. సలార్ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కగా ప్రాజెక్ట్ కే సినిమా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. సలార్ మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోగా ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కు రిలీజైన 24 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

రెండు సినిమాలలో ప్రభాస్ హీరో అయినా ప్రాజెక్ట్ కే (Kalki) సినిమా మాస్ సినిమా కాకపోవడం, ఇతర భాషల ప్రేక్షకుల్లో నాగ్ అశ్విన్ కు పెద్దగా పాపులారిటీ లేకపోవడంతో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇతర భాషల ప్రేక్షకులకు సైతం ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా జాగ్రత్త పడాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సలార్ మూవీ టీజర్ 24 గంటల్లో క్రియేట్ చేసిన రికార్డ్ ను టాలీవుడ్ సినిమాలలో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ పాపులారిటీ వల్లే సలార్ టీజర్ కు వ్యూస్ మరింత పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా పార్ట్1 ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా సలార్ సినిమా పార్ట్2 వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం. ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ కు బాహుబలి2 సినిమాను మించిన విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus