Prabhas: హాస్పిటల్ లో దర్శనమిచ్చిన ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాస్పిటల్ లో కనిపించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది.ఏ హాస్పటిల్ కి ప్రభాస్ వెళ్ళాడో కూడా తెలీదు. ఈ వీడియోలో ప్రభాస్ మాస్క్ పెట్టుకుని చాలా స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.ఇది పాత వీడియో అని కొంతమంది అంటున్నారు.కొత్త వీడియో అని ఇంకొందరు అంటున్నారు.అభిమానుల్లో మాత్రం ప్రభాస్‌కు ఏమైందనే టెన్షన్ మొదలైంది. కృష్ణంరాజును హాస్పటిల్‌లో పెట్టి ఉంటారని..

అతన్ని చూడడానికి ప్రభాస్ వెళ్లి ఉంటాడు అని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్ అయ్యుండొచ్చు కానీ.. కృష్ణంరాజు ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. మరి ప్రభాస్ హాస్పిటల్ కు వెళ్ళడానికి ఇంకేం కారణం అయ్యి ఉంటుంది? అనే డిస్కషన్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రభాస్ అయితే కచ్చితంగా సర్జెరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కొంత‌కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు.ఈ మధ్యనే సర్జెరీ కోసం విదేశాలకు వెళ్ళొచ్చాడు. కానీ సర్జరీ చేయించుకోలేదు. ఎందుకంటే సర్జరీ కోసం ప్రభాస్ బరువు తగ్గాలి అని వైద్యులు సూచించారు.

అందుకోసం ఆక్వా థెర‌పీ తీసుకుని సన్నబడ్డాడు. కండరాల నొప్పి తో బాధపడే వారు బరువు తగ్గడానికి ఇదే బెస్ట్ థెరపీ అని తెలుసుకుని ప్ర‌భాస్ దీనిని ఫాలో అయ్యి బరువు తగ్గాడు. అంటే ప్రభాస్ సర్జరీ చేయించుకున్నట్టే అని కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ ‘సలార్’ ‘రాధే శ్యామ్’ ‘ప్రాజెక్టు కె’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక అసలు విషయం ఏంటో తెలీదు కానీ ప్రభాస్.. హాస్పిటల్ లో కనిపించిన వీడియో వైరల్ అయిపోతుంది. దీని పై క్లారిటీ రాకపోతే ఇంకా ఎన్నో కథనాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus