Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

ప్రపంచాన్ని శాసించే జేమ్స్ కామెరూన్ సినిమాకే ఇండియాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్లు ఇక్కడ దాదాపు రూ. 450 కోట్ల బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ చూస్తే కనీసం 100 కోట్లు దాటడం కూడా గగనమే అనిపిస్తోంది. కేవలం వీరాభిమానులు తప్ప సామాన్య ప్రేక్షకులు థియేటర్ వైపు చూడకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి.

Avatar 3

అసలు అవతార్ కు అతిపెద్ద విలన్ గా మారింది మన లోకల్ సినిమా ‘ధురందర్’. రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా అనూహ్యంగా పుంజుకుంది. దానికి తోడు టీమిండియా క్రికెటర్లు అందరూ కలిసి ఒకేసారి థియేటర్లో సినిమా చూడటంతో, సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. దీంతో ఆడియన్స్ ఆప్షన్ మారిపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ కంటే, మన నేటివిటీ ఉన్న మాస్ సినిమానే బెటర్ అని జనం ఫిక్స్ అయ్యారు. అక్కడే అవతార్ కలెక్షన్స్ కు భారీ గండి పడింది.

మరో పక్క సినిమా నిడివి కూడా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. మూడుంపావు గంటల పాటు సాగే ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నా, కథ మాత్రం పాత చింతకాయ పచ్చడిలా ఉందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. టెక్నికల్ గా ఎంత గొప్పగా ఉన్నా, కథనంలో వేగం లేకపోతే ఈ జనరేషన్ ఆడియన్స్ మెప్పించడం కష్టమని కామెరూన్ కు ఈ సినిమాతో అర్థమై ఉంటుంది. డిసెంబర్ 19న వచ్చిన వేరే రీజనల్ సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అవతార్ కు మరో మైనస్.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే 450 కోట్ల టార్గెట్ అనేది అసాధ్యం అని తేలిపోయింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా ఫ్యూచర్ లో రాబోయే ‘అవతార్ 4’ మీద పడుతుంది. మూడో భాగమే ఇంత నీరసంగా ఉంటే, ఇక నాలుగో పార్ట్ కోసం జనం థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus