బ్ర‌యాన్ ఆడ‌మ్ కి ఆతిథ్యం ఇవ్వడం వెనుక ప్రభాస్ ఆలోచన అదేనా?

రాక్ స్టార్ బ్ర‌యాన్ ఆడ‌మ్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ అతన్ని ఇష్టపడేవారు ఎక్కువ. అందుకే అతను వచ్చేనెలలో ఇండియా టూర్ చేపట్టారు. అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, బెంగుళూర్, ఢిల్లీలో వరుసగా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అతను టూర్ ప్రకటించగానే సంగీత అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్ లో ఈ షో గురించి గురించి మాత్రమే కాకుండా.. ఇంట్రనేషనల్ స్టార్ కి హైదరబాద్ లో ఎవరు ఆతిధ్యం ఇవ్వనున్నారు ? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతను సాహో నిమిత్తం హైదరాబాద్ వచ్చిన శ్రద్దా కపూర్ కి మంచి ఆతిధ్యం ఇచ్చారు.

40 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్ర‌యాన్‌కి గుర్తిండిపోయే ఆతిధ్యం ఇవ్వాలని ప్రభాస్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రభాస్ ఎంటర్ కావడంతో రాక్ స్టార్ ని ఆహ్వానించే విషయంలో అందరూ గౌరవంగా పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. ఇంట్రనేషనల్ స్టార్ కి  ప్రభాస్  ఆతిధ్యం ఇవ్వడం వెనుక మరో కరణ కూడా ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హాలీవుడ్ స్థాయిలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఇతర దేశాల్లో ప్రచారానికి ఈ ఆతిధ్యం పనికొస్తుందని భావిస్తున్నారు. ఇది తెలుసుకొని ప్రభాస్ ఆలోచన మామూలుగా లేదుగా అని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus