Prabhas: ఆ ఒక్క తప్పు ప్రభాస్ ను ఇంతలా భయపెట్టిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో దేశంలోని దాదాపుగా అందరు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రభాస్ అంటే తెలియని సినీ అభిమాని దాదాపుగా ఉండరు. ప్రభాస్ తో తీసే సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు సైతం వస్తున్నాయి. అయితే బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. తెలుగు నేటివిటీ మిస్ కావడం, సుజిత్ రాధాకృష్ణ కుమార్ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేకపోవడం ఈ సినిమాల ఫలితానికి కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ప్రభాస్ పై ఆర్థికంగా కూడా ప్రభావం చూపాయి. సాహో ప్రభాస్ స్నేహితుల బ్యానర్ లో తెరకెక్కగా రాధేశ్యామ్ మూవీ ప్రభాస్ సొంత బ్యానర్ లో తెరకెక్కడం గమనార్హం. అయితే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుల ఎంపికలో పూర్తిస్థాయిలో మారిపోయారు. పాన్ ఇండియా సినిమాలను హ్యాండిల్ చేసే సత్తా ఉన్న దర్శకులకు ప్రభాస్ ఛాన్స్ ఇస్తున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా వందల కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా

ఈ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సైతం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రభాస్ కొత్త డైరెక్టర్లకు, ఒక సినిమా రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం లేదు. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి ప్రభాస్ చాలా మారారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుల ఎంపికలో ఎలాంటి తప్పిదం జరగకుండా ప్రభాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా కెరీర్ పరంగా ప్రభాస్ తీసుకుంటున్న నిర్ణయాలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ ఈ ఏడాది సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus