ప్రస్తుతం మన టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలు కాకుండా, అత్యధిక వంద కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరోలు ప్రభాస్ మరియు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాని చాటుతూ నేటి తరం స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ ఉంటే, బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ తో ఫ్లాప్ టాక్ సినిమాలతోనే వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను కొల్లగొట్టిన హీరో గా ప్రభాస్ నిలిచాడు.
వీళ్లిద్దరి రీసెంట్ సినిమాలు ‘ఆదిపురుష్’ మరియు ‘భోళా శంకర్’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. అభిమానులకు చేదు జ్ఞాపకం లాగ నిల్చిన ఈ రెండు సినిమాల గురించి ఫ్యాన్స్ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇదంతా పక్కన పెడితే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలకు, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలకు టీవీ టెలికాస్ట్ లో ఆదరణ దక్కడం లేదు.
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా ఆరు సినిమాలు చేసాడు. అందులో మూడు భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ ఒక్క చిత్రం కూడా 10 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోవడం గమనార్హం. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని రీసెంట్ గానే జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేసారు. దీనికి కేవలం 5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.
ఇక ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ ని గత ఆదివారం టెలికాస్ట్ చేసారు. దీనికి కేవలం 9 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. భారీ బడ్జెట్ దేవుడి సినిమా టెలికాస్ట్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అలా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ హీరోకి సాధ్యపడని రికార్డ్స్ ని నెలకొల్పిన చిరంజీవి మరియు ప్రభాస్, టీవీ టెలికాస్ట్ అప్పుడు మాత్రం చాలా వెనకబడుతున్నారు. అంటే ఈ ఇద్దరి హీరోలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆదరణ తగ్గిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!