Pradeep Ranganathan: ప్రభాస్ సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్‌పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘ఫౌజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ పొరపాటున ఓ ఈవెంట్‌లో లీక్ చేసేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న ‘డూడ్’ సినిమా ప్రమోషన్లలో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.

Pradeep Ranganathan

ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు. ఈవెంట్‌లో నిర్మాతలను పొగుడుతూ, “నిజం చెప్పాలంటే, వాళ్లు నాకు ప్రభాస్ సర్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలోని కొన్ని క్లిప్స్ చూపించారు. అవి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి” అని అనేశాడు. వెంటనే తాను టైటిల్ చెప్పేశానని గ్రహించి నవ్వేయడంతో, ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ‘సీతా రామం’ లాంటి క్లాసిక్ తర్వాత హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు జరిగే కథతో, ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది.

ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 A.D.’ సీక్వెల్, ‘సలార్ పార్ట్ 2’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘ఫౌజీ’ టైటిల్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. అయితే, ఈ టైటిల్‌పై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2026 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus