Prabhas: ప్రభాస్ కొత్త సినిమా న్యూ లుక్ లీక్..!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. తర్వాత తను చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. తన తాజా చిత్రం సలార్ కోసం ఇప్పటికే యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. దాని తర్వాత వరుస పెట్టి సినిమాలు రానున్నాయి. వాటిలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే ఎన్నో రోజులవుతోంది.

అయినా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ప్రకటించలేదు. ప్రభాస్ తను కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఇద్దరూ బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

డైరెక్టర్ మారుతి ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది ఇలా ఉంటే.. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా సెట్ నుంచి పలు ఫొటోలు మాత్రం లీక్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కామెడీ జోనర్ అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‎కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన ఫోటోల్లో ఒక ఫైట్ లో భాగంగా ప్రభాస్ విలన్స్ తో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ప్రభాస్ కాస్త లావుగా కనిపించారు.. కానీ ఇప్పుడు లీకైన తాజా ఫోటోలో యంగ్ గా కనిపిస్తున్నాడు. ఏక్ నిరంజన్ సినిమాలో స్టైల్ ని మైంటైన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus