పెదనాన్న కోసం ప్రభాస్ ‘ఒక్క అడుగు’

రాజమౌళి దర్శకత్వంలో ప్రబాస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’. ఈ చిత్రంలో ఇంటర్వల్ ముందు వచ్చే ‘ఒక్క అడుగు… ఒకే ఒక్క అడుగు’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ . ‘ఛత్రపతి’ రిలీజ్ తర్వాత ఆ డైలాగు చాలా కాలం జనాల నోళ్లలో నానింది. సినిమాకు అంతలా ప్రాణం పోసిన ఆ డైలాగుతో ఆ తరవాత కృష్ణంరాజు “ఒక్క అడుగు” అనే టైటిల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ టైటిల్‌తో ఓ స్క్రిప్టు తయారు చేయించారు కృష్ణంరాజు.

ఆ చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కించాలని భావించారు. తన సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌లో తానే దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ “ఒక్క అడుగు” చిత్రాన్ని తెరకెక్కించాలన్నది కృష్ణంరాజు ఆలోచన. అయితే ప్రభాస్‌ “బాహుబలి”తో బిజీ అయిపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. “బాహుబలి 2” తరవాత ప్రస్తుతం “సాహో”లో నటిస్తున్న ప్రభాస్‌ చేయాల్సిన ప్రాజెక్టులన్నీ ఒకొక్కటిగా ఖారారవుతున్నాయి. “బాహుబలి 2″ తరవాత ఎలాంటి కథల్ని ఎంచుకోవాలన్న విషయంలో ఓ క్లారిటీకు వచ్చేశాడు ప్రభాస్‌. అయితే..”బాహుబలి 2” తర్వాత తాను చేయబోయే సినిమాల జాబితాలో ఈ “ఒక్క అడుగు” కూడా ఉందన్నది తాజా సమాచారం. అయితే ఈ చిత్రానికి కృష్ణంరాజు కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని, దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని తెలుస్తోంది. మరి “ఒక్క అడుగు” స్క్రిప్టు ఏ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కనుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus