కచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను.. నమ్మండి : ప్రభాస్

‘బాహుబలి’ తో ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు ప్రభాస్. అయితే అంతకు ముందు నుండే అంటే ‘డార్లింగ్’ సినిమా దగ్గరా నుండీ ప్రభాస్ పెళ్ళి మ్యాటర్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు. ‘డార్లింగ్’ సినిమా వచ్చి ఈ నేల 23 కి పదేళ్ళు పూర్తయ్యింది. అయినా ప్రభాస్ పెళ్ళి చేసుకోలేదు. ప్రభాస్ కంటే వయసులో చిన్నోళ్ళు అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ వంటి వారు పెళ్ళి చేసుకుని 8 ఏళ్ళు దాటింది.

చరణ్ ను పక్కన పెడితే అల్లు అర్జున్ కు ఇద్దరు పిల్లలు, ఎన్టీఆర్ కు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పదేళ్ళ నుండీ ప్రభాస్ పెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు ఇండియన్ వైడ్ స్టార్ హీరో అయ్యాడు కాబట్టి.. ఈ టాపిక్ ఇండియన్ వైడ్ వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ అదో పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే ‘నాకు పెళ్ళంటే ఇష్టం లేకపోవడం, విరక్తి వంటివి లేవు అని ప్రభాస్ అంటున్నాడు. కచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను. కానీ అదెప్పుడు అనేది చెప్పలేను.

అనుష్క, నిహారిక వంటి వారితో పెళ్ళి అని వార్తలు రావడం నాకు కామెడీగా అనిపిస్తుంటుంది. అసలు నా పెళ్ళి గురించి ఇంట్లో వాళ్ళ కంటే మీడియా వాళ్ళకే శ్రద్ధ ఎక్కువైపోయింది.’ అంటూ కామెంట్స్ చేసాడు ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ వయసు 41 ఏళ్ళు కావడం గమనార్హం. ‘బాహుబలి’ పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్ళి ఉంటుంది అని ప్రభాస్ పెదనాన్న గతంలో చెప్పాడు. బాహుబలి తో పాటు ‘సాహో’ కూడా వచ్చేసింది. ఇంకా ప్రభాస్ పెళ్ళి మాత్రం అవ్వలేదు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus