దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక్క షాట్ కోసం ఎన్నో టేక్ లు తీసుకుంటారు. సమయం గురించి ఆలోచించరు. తనకు కావాల్సిన ఫ్రేమ్ వచ్చేవరకు కాంప్రమైజ్ కారు. అందుకే ఆయన చిత్రాలు తక్కువైనా.. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యంగా నిలిచాయి. జక్కన్న గత చిత్రం బాహుబలి బిగినింగ్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆ సినిమా సాధించిన రికార్డులను, కలక్షన్లను బ్రేక్ చేయడానికి బాహుబలి కంక్లూజన్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఏడాది నుంచి శ్రమిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సంగతి బయటికి వచ్చింది. బాహుబలి 2 క్లైమాక్స్ లో హైలైట్ గా నిలిచే ఒక యుద్ధ సీన్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక నెల పాటు సాధన చేశారని తెలిసింది. ఒక సినిమా మొత్తాన్ని నెల రోజుల్లో చుట్టేస్తున్న ఈ టైమ్ లో ఫర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ కే నెల రోజులు కేటాయించారంటే.. ఆ సీన్ ఎంత బాగా ఉండనుందో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్, అనుష్క లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల చివరికి ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవుతుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.