స్పీడ్ పెంచనున్న ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మిర్చి’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకుని.. అగ్ర నిర్మాణ సంస్థల లిస్ట్ లో చేరింది ‘యూవీ క్రియేషన్స్’ నిర్మాణ సంస్థ. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్, విక్రమ్ లు మంచి మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుని మీడియం బడ్జెట్ లోనే హిట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ‘రన్ రాజా రన్’ ‘జిల్’ ‘భలే భలే మగాడివోయ్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ ‘భాగమతి’ ‘టాక్సీ వాలా’ ‘సాహో’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

ఇప్పుడు ‘ప్రభాస్ 20’ ని కూడా నిర్మిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా వీరు ఎక్కువ సినిమాలను నిర్మించడం లేదు అని అంతా అనుకుంటున్నారు. ఆ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టడానికి 5 కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేయబోతున్నారని తాజా సమాచారం. అనుష్క తో ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేష్ తో ఒక సినిమా, శర్వానంద్ హీరోగా ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కించే మరో సినిమా.. అలాగే ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయతో ఓ సినిమా ప్లాన్ చేశారట.

అంతేకాకుండా నాగ చైతన్య, గోపీచంద్ లతో కూడా ప్రాజెక్ట్ లు సెట్ అయ్యాయట.. కానీ కథ ఇంకా ఫైనల్ కాలేదు అని టాక్ నడుస్తుంది. అయితే ‘యూవీ క్రియేషన్స్’ వారి కొత్త సినిమాలు అన్నీ 2021 లో మొదలు పెట్టబోతున్నారని సమాచారం. మరో పక్క వీరు అల్లు అరవింద్ గారి రెండో సంస్థ అయిన ‘జిఏ2 పిక్చర్స్’ సంస్థతో కలిసి కూడా వీరు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus