Prabhas, Ram Charan: ప్రభాస్ చరణ్ కాంబోలో మూవీ.. కానీ?

ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు నిర్మాతలకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. మల్టీస్టారర్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం రికార్డు స్థాయి రేటుకు అమ్ముడవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. మగధీర సినిమా చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడంతో పాటు కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసింది.

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సిరీస్ సినిమాలు స్పెషల్ సినిమాలుగా నిలవడంతో పాటు కనీవిని ఎరుగని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. మగధీర బాహుబలి కలిస్తే మాత్రం ఆ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరక్కే అవకాశాలు ఉండగా ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది. సాహో సినిమా ఫ్లాప్ అయినా యూవీ క్రియేషన్స్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్, ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చరణ్, ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus