టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చిన విధంగా ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. గతేడాది ఆదిపురుష్, సలార్ సినిమాలను ప్రభాస్ విడుదల చేయగా ఈ సినిమాలలో ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ గా నిలిస్తే సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 700 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ సినిమా హిట్ గా నిలిచింది.
కల్కి 2898 ఏడీ, రాజాసాబ్, కన్నప్ప, స్పిరిట్, సలార్2 మరికొన్ని సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రభాస్ రెండు సినిమాలను రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే స్టార్ హీరో ప్రభాస్ ఎంతోమంది హీరోయిన్లను అభిమానిస్తారు. అయితే తనతో కలిసి నటించకపోయినా ఒక స్టార్ హీరోయిన్ అంటే ప్రభాస్ కు ఎంతో అభిమానమట. ఆ హీరోయిన్ సాయిపల్లవి కావడం గమనార్హం.
సాయిపల్లవి యాక్టింగ్ అంటే నాకు ఎంతో ఇష్టమని గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ కామెంట్లు చేయడం జరిగింది. ప్రభాస్, సాయిపల్లవి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ సినిమా సినిమాకు సంబంధం లేకుండా వేర్వేరు జానర్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) సినిమాలన్నీ కనీసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ప్రభాస్ సినిమాల బడ్జెట్ లో సగం బడ్జెట్ రికవరీ అవుతోంది. ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు. ప్రభాస్ కన్నడ, మలయాళం, తమిళ భాషలపై ఫోకస్ పెడితే ఈ స్టార్ హీరో రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రభాస్ త్వరలో మరిన్ని భారీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!