లాస్ ఏంజిల్స్ లో భారీ యాక్షన్ సీన్ చేయనున్న ప్రభాస్!

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ తిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. హీరోయిన్ శ్రద్ధ కపూర్,ప్రభాస్ పై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా అమీర్ పెట్ లో వేసిన ఇంటి సెట్ లో పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్ర బృందం దుబాయ్ లో ఉంది. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇక్కడ షూటింగ్ అనంతరం ప్రభాస్,సుజీత్ టీమ్ లాస్ ఏంజెలెస్ లోని హాలీవుడ్‌ కి వెళ్లనుంది.

అక్కడ భారీ సెట్ లో ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేయనున్నారు. ఈ యాక్షన్ సీన్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరగనుంది. హాలీవుడ్ చిత్రాల్లోని యక్ష సెక్వెన్స్ లాగా ఉండే ఈ ఫైట్ ఒక హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus