Salaar: డిజిటల్ హక్కులతో ప్రభాస్ సరికొత్త రికార్డులు.. ఏం జరిగిందంటే?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ కు మరో రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా త్వరలో ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే సలార్ మూవీ డిజిటల్ హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని భోగట్టా.

ఈ సినిమా హక్కుల ద్వారానే దాదాపుగా 70 శాతం బడ్జెట్ రికవరీ అయిందని సమాచారం అందుతోంది. ఈ విధంగా సలార్ సినిమా రిలీజ్ కు ముందే లాభాల్లోకి వచ్చింది. పలు ఏరియాలలో ఈ సినిమాను సొంతంగా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. డిజిటల్ హక్కులతో సంచలనాలు సృష్టించిన ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం. సలార్ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా ఈ (Salaar) సినిమాలో శృతి పాత్ర సరికొత్తగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా సలార్ సినిమాతో ప్రభాస్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదుగుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు క్లాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండనున్నాయని సమాచారం. సలార్ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుస ప్రాజెక్ట్ లతో ప్రభాస్ సత్తా చాటాలని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. సలార్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus