ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. నార్త్ లో కూడా సలార్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. సలార్ రిలీజ్ ట్రైలర్ కు ఇప్పటికే అన్ని భాషల్లో ఏకంగా 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హోంబలే ఫిల్స్మ్ నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా సినిమాపై అంచనాలు పెంచడానికి మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు. మరోవైపు సలార్ మూవీ బుకింగ్స్ మొదలుకాకపోవడం ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఆఫ్ లైన్ లోనే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతుండగా షో టైమింగ్స్ తెలియకపోతే బుకింగ్స్ విషయంలో అభిమానులు కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
సలార్ మూవీ నార్త్ టార్గెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. సలార్ మూవీ టార్గెట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలు, సాహో బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలకు మించి సక్సెస్ సాధించినా ప్రభాస్ గత సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
సలార్ (Salaar) మూవీకి ఇతర భాషల్లో సైతం బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరో కొత్త ప్రపంచాన్ని చూపించనున్నారని సమాచారం. ఎన్నో ప్రత్యేకతలతో సలార్ తెరకెక్కగా ఫ్యాన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!