Salaar Movie: ప్రశాంత్ నీల్.. ‘కె.జి.ఎఫ్’ స్ట్రాటజీనే అప్లై చేయబోతున్నాడా..!

సీక్వెల్స్ అయితే టాలీవుడ్ కు కలిసి రాలేదు కానీ రెండు పార్ట్ ల ట్రెండ్ మాత్రం కలిసొస్తుందని టాలీవుడ్ దర్శక నిర్మాతలు నమ్ముతూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ‘బాహుబ‌లి'(సిరీస్) సూపర్ సక్సెస్ సాధించింది.’కె.జి.ఎఫ్’ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయ్యింది.చాప్ట‌ర్ 2 కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరో పక్క ‘పుష్ష’ కూడా… పార్ట్ 1, పార్ట్ 2గా రావడానికి సిద్దమవుతుంది. టీజర్ చూస్తుంటే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇప్పుడు ‘స‌లార్’ కూడా రెండు పార్టులుగా రాబోతుంది అనేది ఇన్సైడ్ టాక్. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స‌లార్‌’… ‘కె.జి.ఎఫ్’ మూవీలానే ..రెండు భాగాలుగా విడుద‌ల అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది ప్రభాస్ 23వ చిత్రంగా ‘సలార్’ తెరకెక్కుతుంది. ఇక ప్రభాస్ 25వ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో ‘ప్రభాస్ 24’ ఎవరు తెరకెక్కిస్తున్నారు అనే డిస్కషన్లు కూడా నడిచాయి.

ఇది పక్కన పెడితే.. ‘సలార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రభాస్ – ప్ర‌శాంత్ నీల్.. ల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జరుగుతున్నాయట. స్క్రిప్ట్ కనుక ఫైనల్ అయితే పార్ట్ 2 కూడా తెరకెక్కడం ఖాయమని వినికిడి. ఈ నేపథ్యంలో ‘సలార్’ పార్ట్ 1 ను ఎలా ముగిస్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. చూడాలి మరి..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus