Spirit: ‘స్పిరిట్’ అప్‌డేట్: ఏ లుక్‌తో ప్రభాస్ రెడీ అయి వస్తాడో మరి..
- May 11, 2026 / 12:32 PM ISTByFilmy Focus Desk
ప్రభాస్ సినిమాల షెడ్యూళ్ల విషయంలో ఓ చిన్న కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఓవైపు సినిమా షూటింగ్ అవుతుంది అంటారు కానీ సినిమా టీమ్ నుండి కానీ, సోషల్ మీడియా టీమ్ నుండి ఎలాంటి అప్‌డేట్స్ ఉండవు. ఎందుకిలా చేస్తున్నారు, దాని వెనుక ఉన్న ఆలోచనలు ఏంటి అనేది తెలియదు కానీ.. పరిస్థితి అయితే ఇది. అయితే షూటింగ్ అవుతోంది, ఏదో జరిగింది లాంటి లీకులు మాత్రం వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ లీక్ వచ్చింది. అదే ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుందట.
Spirit
అసలు, షెడ్యూల్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తయింది.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఏంటి అనే డౌట్ రావొచ్చు. కానీ మొదలైంది, కొనసాగింది, పూర్తయింది కూడా. ఆ విషయం వదిలేసి ఇప్పుడు కొత్త షెడ్యూల్ సంగతి చూస్తే.. చిన్న విరామం తర్వాత హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేశారట. ఈ సారి లాంగ్ షెడ్యూలే ప్లాన్ చేశారట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది.
పోలీసు యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఐపీఎస్ అధికారిగా అలరించనున్నారు. కెరీర్‌లో తొలిసారి డార్లింగ్ పోలీసుగా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఇందులో గ్రే షేడ్ కూడా ఉంటుందట. అంటే విలనీ కూడా ప్రభాస్ పండిస్తాడట. అందుకే ఈ సినిమాలో ప్రభాస్ మూడు లుక్స్‌లో కనిపిస్తాడని చెబుతున్నారు. వాటి సంగతి తేలాలంటే వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లకు వెళ్లాలి. ఆ రోజే ‘స్పిరిట్’ రిలీజ్ అని టీమ్ ఇప్పటికే చెప్పింది. మరి మాట మీద నిలబడి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్‌రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నట్లు మూడు లుక్‌ల్లో ప్రభాస్ ఈ షెడ్యూల్‌లో ఏ లుక్‌తో వస్తాడో చూడాలి.















