Prabhas: వైరల్ అవుతున్న ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజైన తర్వాత ఇండియాలోనే ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా పూర్తయ్యేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ సినిమాకు ఖర్చు చేసి ఉంటే నిర్మాతలకు ప్రయోజనం చేకూరేదని సినిమా రిలీజైన తర్వాత క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. రాధేశ్యామ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చిన తరుణంలో రాజమౌళికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ రాధేశ్యామ్ బడ్జెట్ కు సంబంధించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch Now

రాధేశ్యామ్ సినిమాను 2 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీయవచ్చని ప్రభాస్ చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ సినిమాను పెద్ద సినిమాగా తీయాలని ఎందుకు అనిపించిందని రాజమౌళి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ తక్కువ బడ్జెట్ లోనే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేయవచ్చని ప్రభాస్ తెలిపారు. అయితే దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తే బాగుంటుందని తాను భావించానని ప్రభాస్ కామెంట్లు చేశారు. మంచి నిర్మాతలు కుదరడంతో ట్రైన్ ఎపిసోడ్ ను, షిప్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా తెరకెక్కించాలని అనుకున్నామని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ఆ విధంగా రాధేశ్యామ్ సినిమా భారీ బడ్జెట్ మూవీ అయిందని ప్రభాస్ వెల్లడించారు. అయితే ట్రైన్ ఎపిసోడ్, షిప్ ఎపిసోడ్ సినిమాలో అనుకున్న స్థాయిలో లేవని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. రాధేశ్యామ్ సినిమా కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉన్నా హిందీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. బాలీవుడ్ లో రాధేశ్యామ్ సినిమాకు భారీ నష్టాలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫుల్ రన్ లో రాధేశ్యామ్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ తర్వాత సినిమాలతో అయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus