Prabhas: మరో ప్రాజెక్ట్ ను అలా సెట్ చేసుకుంటున్న రెబల్ స్టార్!

రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో రాధేశ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్, అలానే హిందీ వెర్షన్ కి మన్నన్, మిథూన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు ఎంతో భారీగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

దీనితో పాటు బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ షూట్ కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఇక దీనితో పాటు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ కూడా మరోవైపు షూట్ జరుపుకుంటోంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఇక నాగ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ ని జరుపుకోనుంది.

వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ లో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ నాలుగు సినిమాల తరువాత టాలీవుడ్ ప్రఖ్యాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రభాస్ నెక్స్ట్ మూవీ చేయనున్నారు. ఇటీవల ఈ విషయాన్ని మైత్రి నిర్మాతలు వెల్లడించడం జరిగింది. కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన బడా డైరెక్టర్ ఒకరు స్టోరీ సిద్ధం చేసారని, అన్ని అనుకున్నట్లు జరిగితే పూర్తి స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ గా పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్ మొత్తం ఒకేసారి ఐదు సినిమాలు లైన్లో పెట్టారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus