Prabhas: ‘ఆదిపురుష్’ నిర్మాతలతో మరోసారి..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు సందీప్ వర్మ దర్శకత్వంలో ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ కోసం అయోధ్యకు వెళ్లారు. ఆయనతో పాటు టీమ్ మొత్తం ఈవెంట్ కి హాజరైంది.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ స్పీచ్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్ తో నాలుగోసారి కలిసి పని చేయబోతున్నట్లు చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందట. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు భూషణ్ కుమార్. ఇప్పుడు ప్రభాస్ తో మరో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. అంటే.. ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమాకి కమిట్ అయ్యారన్నమాట.

అయితే ప్రస్తుతం ఆయన చేతులో వరుస సినిమాలు ఉండడంతో.. ఈ బాలీవుడ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. ముందుగా మారుతి సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు ప్రభాస్. ఈ ఏడాది చివరి నెలలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. దాని తరువాత ‘సలార్’, ప్రాజెక్ట్ K’ సినిమాలు ఉన్నాయి.

వచ్చే ఏడాదిలోనే ‘స్పిరిట్’ సినిమాను కూడా మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ కమిట్మెంట్స్ అయిన తరువాత బాలీవుడ్ సినిమా మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus