Prabhas: భారత్ – పాక్ మ్యాచ్ లో ప్రభాస్ సాంగ్ ..!

భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఆసియాక‌ప్ 2023లో భాగంగా శ‌నివారం ప‌ల్లెక‌లె వేదిక‌గా ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఫ‌లితం సంగ‌తి కాసేపు ప‌క్క‌న బెడితే ఈ మ్యాచ్‌లో భార‌త క్రికెట‌ర్లు బౌండ‌రీలు బాదిన ప్ర‌తి సారీ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాలోని ఓ పాట‌ను డీజే ప్లే చేయ‌డం విశేషం. ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ (హిందీ వెర్ష‌న్) చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ అంటూ సాగే సాంగ్‌ను ప్లే చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుండి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను ఇషాన్ కిషాన్ (87), హార్దిక్ పాండ్యా (82) చేపట్టారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరు బౌండరీ కొట్టినప్పుడల్లా ఆదిపురుష్ సినిమాలోని రామ్ సియా రామ్ పాటను డీజే నిర్వాహకులు ప్లే చేశారు.

బంతి బౌండరీ వెళ్లిన ప్రతిసారి రామ్ సియా రామ్ పాట రావడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. అభిమానులు కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు. కాగా.. భార‌త ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత వ‌ర్షం ప‌డింది. ఎంత‌కు త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయించారు.

తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై పాక్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ సూప‌ర్ 4 అర్హ‌త సాధించింది. టీమ్ఇండియా సూప‌ర్ 4కు అర్హ‌త సాధించాలంటే నేపాల్‌ను ఓడించాల్సి ఉంటుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus