యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కలు టాలీవుడ్ హిట్ పెయిర్ గా పేరుగాంచారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా బిల్లా విజయం సాధించింది. ఆ తర్వాత డార్లింగ్, స్వీటీ కలిసి నటించిన మిర్చి సూపర్ హిట్ అయింది. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ బాగా పండింది. అందుకే బాహుబలి కంక్లూజన్ లోను అలరించనున్నారు. ఈ జోడి పై ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల చివర్లో ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రభాస్ తన పెళ్లి పనుల్లో బిజీ కానున్నారు. బాహుబలి 2 రిలీజ్ కంటే ముందే ఓ ఇంటివాడు కాబోతున్నారు.
స్నేహితుడు ప్రభాస్ వివాహం చేసుకోబోతుండడంతో అనుష్క కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనుంది. అంతేకాదు డార్లింగ్ కంటే ముందే పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఒకే చెప్పేసింది. బెంగుళూర్ కి చెందిన ప్రముఖ వ్యాపారితో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమైంది. బాహుబలి తర్వాత అనుష్క బాగమతి అనే సినిమాకు మాత్రమే సైన్ చేసింది. ఆ మూవీని తొందరగా కంప్లీట్ చేయమని, తనపై ఉన్న సీన్లన్నీ ముందుగా షూట్ చేయమని డైరక్టర్ అశోక్ కి చెప్పినట్లు తెలిసింది. వీలైనంత వేగంగా ఆ ప్రాజక్ట్ కి కంప్లీట్ చేసి, పెళ్లి చేసుకొని ప్రభాస్ వివాహానికి భర్తతో కలిసి హాజరై షాక్ ఇవ్వాలని ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.