హిట్టు డైరెక్టర్ కి ఎదురుచూపులు తప్పట్లేదు!

నిన్న ‘ఆదిపురుష్’ చిత్రబృందం సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుందని చెప్పినప్పుడు అందరూ కూడా సీత పాత్రధారిని పరిచయం చేస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ పెరిగిపోయింది.

నిజానికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తరువాత నాగ్ అశ్విన్ సినిమా చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ప్రభాస్ ‘ఆదిపురుష్’ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా సైంటిఫిక్ టచ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దానికి ఎక్కువ సమయం పడుతుందని.. ముందుగా ‘ఆదిపురుష్’ పూర్తి చేసి ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ మీదకి వెళ్లాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఆదిపురుష్’ సినిమా కోసమే చాలా సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ‘రాధేశ్యామ్’ సినిమా పూర్తి చేశాక వచ్చే ఏడాది మొత్తం ‘ఆదిపురుష్’ సినిమాకి కేటాయించేలా కనిపిస్తున్నాడు.

ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కూడా సమయం పడుతుంది. బహుశా చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమాను మొదలుపెడతాడేమో. 2022లో ఈ ప్రాజెక్ట్ మొదలైనా.. 2023కి కానీ రిలీజ్ కాదు. అలా చూసుకుంటే ‘మహానటి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ కి నాలుగేళ్లు గ్యాప్ రావడం ఖాయమనిపిస్తుంది.

strong>Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus