ప్రస్తుతం ప్రభాస్ ఓ పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా రాధా కృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగుతుందట. అందుకే ప్రత్యేకమైన సెట్స్ లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఇటీవల ప్రభాస్ ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహానటి వంటి అవార్డు విన్నింగ్ మూవీకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సబ్జెట్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న తరుణంలో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని తెలుస్తుంది. దీనితో ప్రభాస్ పూర్తి మేక్ ఓవర్ కానున్నాడట. ప్రస్తుత చిత్ర షూటింగ్ పూర్తయిన వెంటనే ఫిజికల్ మేక్ ఓవర్ ఫై ద్రుష్టి పెట్టాలని నాగ్ అశ్విన్ ప్రభాస్ కి సూచించాడట. కాబట్టి సూపర్ హీరో బాడీ కోసం ప్రభాస్ నిపుణుల సమక్షంలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడట. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ చాల కష్టపడ్డాడు. మొదటి పార్ట్ లో మహేంద్ర బాహుబలి కోసం కొంచెం బరువు తగ్గిన ప్రభాస్, బాహుబలి 2 లో అమరేంద్ర బాహబలి పాత్ర కోసం హల్క్ బాడీతో గంభీరంగా తయారయ్యారు. ఇక ఈ చిత్రం కోసం కూడా ప్రభాస్ తన ఫిజిక్ విషయంలో భారీ మేక్ ఓవర్ చూపించనున్నాడట.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!