ప్రభాస్ పై సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ కామెంట్స్ వైరల్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు.’జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ కు తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ నటిస్తోంది. ఈమె గతంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘యువరత్న రాణా ‘ చిత్రంలో బాలకృష్ణకు చెల్లెలి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. మళ్ళీ ఇన్నేళ్లకు ఓ తెలుగు హీరో సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా..

ఇటీవల భాగ్య శ్రీ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఈమెను ప్రభాస్ క్రష్ అన్నాడట. అది ఏ సందర్భంలోనో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. భాగ్య శ్రీ మాట్లాడుతూ.. “ప్రభాస్ తో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌ అలాగే యూనిట్ సభ్యులు అందరూ ‘మైనే ప్యార్ కియా’ సినిమాకు పెద్ద ఫ్యాన్స్ అట‌. ఒకానొక టైంలో నా పై క్రష్ ఉండేదని స్వయంగా ప్రభాస్ నాకు చెప్పడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను.

ప్ర‌భాస్ చాలా మంచి వ్యక్తి. ఆయ‌న ఇతరులను ట్రీట్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను తినే టేబుల్ పై 15 ర‌కాల వంటలను ఉంచుతాడు. ‘ఇన్ని ఐటమ్స్ నేను తిన‌లేను బాబోయ్’ అని చెప్పినా వినడు. ఓసారి హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్‌ కూడా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus