సాహో కోసం బాగా తగ్గిన ప్రభాస్!

పరుగు పందెంలో పాల్గొనే అథ్లెటిక్స్ బాడీ ఇతరుల బాడీకి భిన్నంగా ఉంటుంది. బరువు తక్కువుగా ఉండాలి.. ఫిట్ గా ఉండాలి. ఎక్కడెక్కడ బాడీ పెంచాలో తగ్గించాలో వారికే తెలుసు. ఈ కష్టమంతా చురుకుగా ఉండడానికే. ఇటువంటి బాడీనే ప్రభాస్ సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమా కోసం కండలు పెంచి.. సిక్స్ ప్యాక్ చూపించిన ప్రభాస్.. ఈ సారి అథ్లెటిక్ ఫిట్ బాడీ తో గాల్లో విన్యాసాలు చేయనున్నారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో కొన్ని రకాల యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే ఇటువంటి బాడీ ఉంటేనే సాధ్యమని చెప్పడంతో తక్కువకాలంలోనే అథ్లెటిక్ బాడీని తెచ్చుకొని ఔరా అనిపించారు. బరువు తగ్గిన ప్రభాస్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై.. లైక్లు, షేర్లు అందుకుంటోంది.

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో అబుదాబి లో షూటింగ్ జరుపుకోనుంది. ఈనెల మూడో వారం నుంచి మొదలు కానున్న ఈ షూటింగ్ కోసం సుజీత్ టీమ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus