ప్రభాస్ ఆస్తులపై ఇంట్రెస్టింగ్ స్టోరీ!

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అతడికి సంబంధించిన ప్రతీ వార్తా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన సినిమాలు, వ్యక్తిగత విషయాలు ఇలా ప్రతీ విషయంపై జనాల ఫోకస్ బాగా పెరిగిపోయింది. మీడియా కూడా ప్రభాస్ కి సంబంధించిన వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ప్రభాస్ ఫామ్ హౌస్ ముచ్చట్ల గురించి బాలీవుడ్ మీడియాలోనూ వార్తలొస్తుండడం విశేషం. ఈ ఫామ్ హౌస్ విలువ ఏకంగా రూ.60 కోట్లని చెబుతున్నారు.

హైదరాబాద్ నగర శివార్లలో చాలా మంది సెలబ్రిటీల మాదిరి ప్రభాస్ కూడా పెద్ద ఫామ్ హౌస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పంటలు పండించడంతో పాటు వివిధ రకాల చెట్లను కూడా పెంచుతున్నాడు. ప్రభాస్ ఎప్పుడైనా.. అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడిపే విధంగా ఉండేలా ఏర్పాట్లన్నీ చేస్తున్నారట. సౌకర్యాలకు ఏ లోటూ లేని ఈ ఫామ్ హౌస్ విలువ రూ.60 కోట్లని ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. తెలంగాణా అధికార పార్టీ ఎంపీ సంతోష్ తో కలిసి ప్రభాస్ మొక్కలు నాటింది కూడా ఈ ఫామ్ హౌస్ లోనే.

ప్రకృతిని ప్రేమించే ప్రభాస్ హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొని దాన్నిమెయింటైనెన్స్ బాధ్యత తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీనికోసం అతను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొనేళ్ల పాటు దాని బాధ్యతలు మొత్తం ప్రభాస్ టీమ్ చూసుకోబోతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించనున్నారు. ఓం రౌత్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus