ఆర్టీఏ ఆఫీస్ లో ప్రభాస్ సందడి..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త కారు కొన్నారు. పెరిగిన తన హోదాకు తగ్గట్లు 2.82 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారుని ఇంటికి తెచ్చుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ కోసం డార్లింగ్ శుక్రవారం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆర్టీఏ అధికారులు ప్రభాస్ కారుకు టీఎస్09 ఈఎస్ 7567 నంబర్ ను కేటాయించారు. ఫీజు నిమిత్తం రెబల్ స్టార్ 5 వేలు చెల్లించారు. బాహుబలి తో ఫోటోలు తీసుకోవడానికి అధికారులు ఉత్సాహం చూపించారు.

ప్రభాస్ వచ్చారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆర్టీఏ ఆఫీస్ కి చేరుకున్నారు. అక్కడివారికి ఇబ్బంది కలగకూడదని ప్రభాస్ వేగంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ప్రభాస్ నెలరోజుల నుంచి నిర్విరామంగా పాల్గొంటున్నారు. సెప్టెంబర్ వరకు షూటింగ్ కొనసాగుతుంది. అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని రన్ రాజా రన్ దర్శకుడు సుజ్జి తీయనున్న సినిమా చర్చల్లో పాల్గొననున్నారు. బాహుబలి కంక్లూజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచమంతా రిలీజ్ చేయడానికి ఎస్.ఎస్.రాజమౌళి బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus