ప్రభాస్ 19 మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- April 10, 2017 / 05:52 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత చేయనున్న సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీ గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే దానికంటే ముందు ఈ సినిమా టీజర్ రెడీ కావడం విశేషం. పోలీసాఫీసర్ గా ప్రభాస్ కొన్ని యాక్షన్ షాట్స్ డైరక్టర్ చిత్రీకరించినట్లు తెలిసింది. సాహో అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్రం టీజర్ ని బాహుబలి 2 రిలీజ్ కంటే ఒక రోజు ముందే రిలీజ్ చేసేందుకు సుజీత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇదే నిజమైతే.. ఒక సినిమా రిలీజ్ కంటే ముందు దాని తరవాత సినిమా టీజర్ రిలీజ్ కావడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇది తొలిసారి అవుతుంది. ఆ రికార్డ్ డార్లింగ్ ఖాతాలో పడనుంది. దుబాయ్ లో ఎక్కువగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందనా ఆడి పాడనుండగా, బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు డార్లింగ్ ఫిల్మ్ కి సంగీతాన్ని అందించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















