Kalki 2898 AD: ‘కల్కి’ ప్రచార బరువు మొత్తం ‘బుజ్జి’ మీదే.. నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటంటే?

  • May 24, 2024 / 05:03 PM IST

‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’.. ఈ ఒక్క వాక్యం పట్టుకుని ‘బాహుబలి 2’ (Baahubali 2) సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (S. S. Rajamouli) అండ్‌ టీమ్‌. సినిమా తొలిపార్టు క్లైమాక్ష్‌లో జరిగిన ఓ కీలకమైన ఘటన ఆధారంగా ఆ డైలాగ్‌ పుట్టి.. సినిమాను అంతెత్తున కూర్చోబెట్టింది. ఇప్పుడు ఇంతటి పెద్ద బాధ్యతను ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టీమ్‌ ‘బుజ్జి’ మీద పెడుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘కల్కి’ సినిమాలో భైరవ ఫ్రెండ్‌ బుజ్జిగా ఓ స్పెషల్‌ కారు ఉంటుంది.

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో పని చేసే ఆ కారుకు బ్రెయిన్‌ కూడా ఉంటుంది అని ఇప్పటికే టీమ్‌ వివిధ వీడియోల ద్వారా తెలియజేసింది. ముందుకు రెండు చక్రాలు, వెనక్కి ఒక చక్రంతో ఆ కారు భలేగా ఉంది అని చెప్పాలి. అందుకే బుజ్జికి మ‌రింత మైలేజ్ రావ‌డానికి పేటెంట్ హ‌క్కులు తీసుకుందట. వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన‌పప్పుడు ఇలా పేటెంట్‌ తీసుకుంటూ ఉంటారు. వైజ‌యంతీ మూవీస్ కూడా అదే ఆలోచనతో బుజ్జి మోడ‌ల్ పేటెంట్ హ‌క్కులు ద‌క్కించుకుందట.

అంతేకాదు బుజ్జిని దేశ‌మంతా తిప్ప‌బోతున్నారట. అంటే సినిమాకు ఇదొక మస్కట్‌లాగా అన్నమాట. అలా ‘కల్కి’ బుజ్జి దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్ల‌బోతోంది. దిల్లీ, ముంబయి, చెన్నై, కొచ్చి, బెంగ‌ళూరు, అహ్మదాబాద్‌.. ఇలా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాకు బుజ్జిని తీసుకెళ్తారట. అక్క‌డ ఈవెంట్లు కూడా ఉంటాయి. ఇక సినిమా పూర్త‌య్యాక‌ బుజ్జిని ఏం చేయాలి అనే విషయంలోనూ టీమ్‌ దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయట. అయితే సినిమా రెండు పార్టులు అంటున్న నేపథ్యంలో ఇప్పుడే ‘బుజ్జి’ పని అయిపోయింది అని చెప్పలేం. అలా బుజ్జి తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ల‌డానికి ఓ బ్రాండ్‌గా ఉప‌యోగ‌ప‌డ‌బోతోందన్నమాట.

సుమారు ఆరు టన్నుల బరువు ఉన్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారు. ఈ సూపర్‌ కారు కోసం సుమారు రూ.7 కోట్లు వెచ్చించారట. కారు ముందువైపు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే ఉంటాయి. టైర్లు పొడవు 6,075 మి.మీ., వెడల్పు 3,380 మి.మీ., ఇక ఎత్తు 2,186 మి.మీ. రిమ్ సైజ్ 34.5 అంగుళాలు. ఇక ఈ కారు పవర్ 94 Kw కాగా.. బ్యాటరీ 47 KWH. ఈ కారుకు ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh) వాయిస్ ఓవర్ ఇచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus